రెండో రోజు ఆట పూర్తి.. ఆసీస్ 62 పరుగుల లీడ్
దిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 262 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 61 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ ఖవాజా (6)ను జడేజా ఔట్ చేశాడు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ (39*), లబుషేన్ (16*) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లోని సాధించిన ఒక పరుగు ఆధిక్యంతో కలుపుకొని ఆసీస్ 62 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది.