హ్యూమన్ రైట్స్ టుడే /హైదరాబాద్/ తెలంగాణ /జనవరి 30: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో పిల్లల వ్యాధులకు సంబంధించి కొత్త విభాగాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. తొలుత మూర్ఛ, పీడియాట్రిక్ రుమటాలజీ విభాగాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. పిల్లలు మూర్ఛ బారినపడితే తల్లిదండ్రులు నిలోఫర్ లేదా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. చికిత్సకు ప్రైవేటులో రూ.లక్షలు ఖర్చవుతోంది. ఈ క్రమంలో పేదల కోసం నిమ్స్‌లో రూ.2 కోట్లతో పిల్లల మూర్ఛ వ్యాధి విభాగం సిద్ధమవుతోంది.
