హ్యూమన్ రైట్స్ టుడే/ న్యూఢిల్లీ /జనవరి 30: భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) రూ.10,000 కోట్ల విలువైన రాకెట్లు, మందుగుండు సామగ్రి కోసం అతిపెద్ద దేశీయ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా పినాకా రాకెట్లు, ఏరియా డిస్ట్రక్షన్ మందుగుండు సామగ్రి కొనుగోలు చేయనున్నారు. వీటిని మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL), ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ (EEL) ఉత్పత్తి చేస్తాయి.
