జర్నలిజమా…నీ వెక్కడ..?

Get real time updates directly on you device, subscribe now.

పరిశోధనాత్మక జర్నలిజమా…నీ వెక్కడ..?

“నక్కీరన్” పత్రిక ఎందరికి తెలుసు…?

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జనవరి 16: పత్రికా రంగంలో చిన్న, పెద్ద పత్రికలు అని తేడా చూపిస్తున్న ఎంతో మందికి చిన్న పెద్దా పత్రిక తేడాలు తగదు అంటూ తన పరిశోధనాత్మక కధనంతో దక్షిణ భారతదేశంలో వీరప్పన్ పై సంచలనాత్మక కధనాలు రాసి జర్నలిజం చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. ఈపత్రికను తమిళనాడు లో గోపాలన్ అనే వ్యక్తి నడిపాడు.

దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను గడగడలాడించి ఆయా ప్రభుత్వాలను టారెత్తించి బయట ప్రపంచానికి తానెవరో తెలియని వీరప్పన్ ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తూ వీరప్పన్ తో గోపాలన్ ప్రత్యేక ఇంటర్యూ జరిపి ఓ టీవీ ఛానల్తో టై అప్ అయ్యి నక్కీరన్ సౌజన్యంగా దేశ ప్రజలకు అప్పటి వరకు వీరప్పన్ పేరు మాత్రమే తెలిసి అతని రూపు తెలియని దేశ ప్రజలకు వీరప్పన్ అంటే ఇతను ఇలా ఉంటాడు అని చూపించిన వ్యక్తి ఎడిటర్ గోపాలన్.

ఇక వీరప్పన్ విషయానికి వస్తే ప్రైవేటు సైన్యం (ఒక సమయంలో వందల సంఖ్యకు విస్తరించింది)నడుపుతూ కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు, భారత సరిహద్దు భద్రతా దళంలోని పారామిలటరీ ఫోర్సులను ముప్పు తిప్పలు పెట్టారు. 184 మంది, అందులో దాదాపు సగం మంది పోలీస్ అధికారులు (ఫారెస్ట్ అధికారులు, ఉన్నతాధి కారులు కలిపి) చంపిన కేసుల్లో వీరప్పన్ వాంటెడ్ గా ఉండేవారు. 200 ఏనుగులను అక్రమంగా చంపి, యుఎస్ డాలర్లు 2.6 మిలియన్ల రూపా యల విలువైన ఏనుగు దంతాలు, దాదాపు యూఎస్ డాలర్లు 22మిలియన్ల విలువైన 10వేల టన్నుల చందనం చెక్కను అక్రమ రవాణా చేసినందుకూ అతను మోస్ట్ వాంటెడ్ గా నిలిచారు.

1991లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నెలకొల్పి వీరప్పన్ ను పట్టుకునేందుకు చేపట్టిన ప్రయత్నం సంవత్సరాలు గడిచేకొద్దీ దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖర్చు అయిన ఆపరేషన్ గా నిలిచింది.

 ఇంకా తాను దోచుకున్న అటవీ సంపద వేల కోట్లలో ఉంటుంది అని పలు కధనాలు అక్కడి దిన పత్రికలు పెద్ద పెద్ద హెడ్ లైన్స్ వేసి ప్రతీ కథనానికి వీరప్పన్ యుక్త వయసులో ఉన్న ఒకటే ఫొటో అక్కడి పత్రికలు ప్రచురించి ఎల్లో జర్నలిజం దిశగా అడుగులు వేశాయి. ఆ ఫొటో ఒక్కటే ప్రతి పేపర్ కధనానికి ప్రతి సారీ రావడం పై అనుమానం కలిగిన గోపాలన్ ఏంతో పట్టుదల, ధైర్యంతో సాహసోపేత నిర్ణయం తీసుకుని అత్యంత ప్రమాదకారి అని, మనిషి ప్రాణాలు తీయడంలో ఏ మాత్రం దయా, దాక్షిణ్యాలు లేని వ్యక్తి వీరప్పన్ అని తెలిసినా వందల మైళ్ళు అడవిలో ప్రయాణం చేసి పట్టుదలతో వీరప్పన్ జాడ కనిపెట్టి తానొక జర్నలిస్ట్ నని పరిచయం చేసుకుని మీ పై పత్రికలలో ఇలా వరుస కథనాలు వస్తున్నాయని అది ఎంత వరకు నిజం అని తెలుసుకోవడానికి వచ్చానని గోపాలన్ వీరప్పన్  దళానికి సమాచారం అందించాడు. అంతకు ముందే  అడవిలో తన స్థావరం వైపు ఎవరో వస్తున్నారని పక్షుల కదలికలు ద్వారా అరుపులు ద్వారా కనిపెట్టిన వీరప్పన్ గోపాలన్ విషయం తన దళ సభ్యులు తెలిపినా గోపాలన్ ని కలిసేందుకు వీరప్పన్ ఇష్ట పడలేదు. అయినప్పటికీ అక్కడే పట్టువదలని విక్రమార్కుడులా కూర్చున్న గోపాలన్ ని అన్ని విధాలా చెక్ చేసి అతని వద్ద ఏ విధమైన ఆయుధాలు లేవని కేవలం అతని వద్ద ఉన్న వీడియో కెమెరా, బ్యాటరీలు, అతని వెంట వచ్చిన కెమెరా మెన్ ని పరిశీలించి అన్నీ నిర్ధారణ చేసుకుని వీరప్పన్ అప్పుడు అతనిని కలిసి ఇంటర్యూ ఇచ్చేందుకు కెమెరా ముందుకు వచ్చాడు. అలా ధైర్యంగా వ్యవహరించి గోపాలన్ వీరప్పన్ ఇంటర్యూ తీసుకుని తమిళనాడులో టీవీల ద్వారా ప్రసారం చేశాడు. ఆ ఇంటర్యూలో వీరప్పన్ అడవితల్లి ఒడిలో ఉన్న నేను అటవీ సంపదను ఎందుకు దోచుకుంటాను. ఎదో కొద్దిగా నా తల్లి సంపదను వాడుకున్న మాట వాస్తవం ప్రభుత్వం, పత్రికలు చెప్పినట్లు నేను కాదు. నా పేరున స్థానిక పాలకులు, అటవీశాఖ అధికారి శ్రీనివాసన్ అనే వ్యక్తి అటవీ సంపదను పెద్ద ఎత్తున దోచుకుని నా మీద నిందలు మోపారు అని, ఇదే శ్రీనివాసన్ అనే వ్యక్తి తన చెల్లిని ప్రేమించి మోసం చేసినట్టు వీరప్పన్ ఆ ఇంటర్యూలో పాలకులు, అటవీశాఖ అధికారుల తీరును ఎండగట్టాడు. గోపాలన్ నక్కీరన్ సౌజన్యంతో ఓ టీవీలో ప్రసారం చేసిన వీరప్పన్ ఇంటర్యూ తమిళనాడు ప్రజల మన్ననలు పొంది ప్రజలకు వీరప్పన్ పై సానుభూతి లభించగా గోపాలన్ పత్రికకు విశేషమైన ఆదరణ లభించింది. దీనితో గోపాలన్ కి వీరప్పన్ కి మధ్య మంచి సహకారం కుదిరింది. ఈ సాకుతో అక్కడ ప్రభుత్వం గోపాలన్ పై పోటా యాక్ట్ అమలు చేసి గోపాలన్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపింది. అప్పటి నుండి గోపాలన్ నక్కీరన్ పత్రిక ప్రశ్నార్థకం అయ్యింది. ఇక పోతే చిన్న పత్రికల పై ఉండే స్వభావం తమిళనాడు ప్రజల్లో తొలగిపోయి పత్రిక పేరే ఇంటి పేరుగా మారి గోపాలన్ కాస్తా,,”నక్కీరన్ గోపాలన్”గా అప్పట్లో సంచలనాలకు మారు పేరుగా మారింది.

  ఈపూరి రాజారత్నం
M.A,MJMC,(Ph.D)
       Journalisam
      వెటరన్ జర్నలిస్ట్
       *9390062078*

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment