హ్యూమన్ రైట్స్ టుడే/సత్తెనపల్లి/ జనవరి 15: సత్తెనపల్లి పట్టణంలోని ఎప్పుడు నిరంతరంగా రద్దీగా ఉండే తాలూకా సెంటర్లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన డివైడ్ స్థంభం గత రెండూ రోజులుగా రోడ్డు మీదకు జరిగి పడి ఉంది, వచ్చే వెళ్లే వాహనాలకు అడ్డముగా ఉన్న అధికారులు పట్టించుకోవట్లేదు. పొరపాటున ఎవరైనా చూసుకోకుండా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని, అధికారులు ప్రమాదం జరిగి ప్రాణాలు పోయేదాకా పట్టించుకునేలాగలేరని. ఇప్పటికైనా సంబధిత అధికారులు పట్టించుకోని డివైడర్ స్తంభాన్ని మళ్లీ సరి చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.