కోడి పందాలతో నేర చట్టం ఉల్లంఘన…
అధికారుల చర్యలు కఠినంగా ఉండాలి…
రాజకీయ మరియు సాంస్కృతిక కారణాలతో చర్యలు శూన్యం…: విజయ్ నాయుడు
కోడి పందేలు నిర్వహణ అనేది భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో నిషేధితమైన కార్యకలాపం, ఎందుకంటే ఇది జంతు క్రూరత్వాన్ని నిరోధించే చట్టాలకు (Prevention of Cruelty to Animals Act, 1960) వ్యతిరేకం…
ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్-1974 సెక్షన్-10, జంతుహింస నివారణ చట్టం-1960 సెక్షన్ 34 ప్రకారం కోడి పందాలు నిషేధం…
కోడి పందాలు అరికట్టాల్సిన పశుసంవర్ధక శాఖ జాడ లేదు…
వీధి కుక్కలు కొన్నిసార్లు మనుషులకు ప్రమాదకరంగా మారడం వల్ల ప్రజల నుంచి దూరంగా తీసివేయాలని, నిర్మూలించాలని తలచినప్పుడు మాత్రం కేసులు నమోదు చెసే పశుసంవర్ధక శాఖ…కోడి పందాలు అరికట్టడంలో విఫలం అవుతుంది…
పశుసంవర్ధక శాఖ కోడి పందేల నిర్వహణను గుర్తించి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి, స్థానిక పోలీస్ స్టేషన్లతో కలిసి నిఘా నిర్వహించటం చేయాలి. కోడి పందేలు నిర్వహించిన వారిపై జంతు సంక్షేమ చట్టాల కింద కేసులు నమోదు చేయాలి, కోళ్లను రక్షించి, పునరావాసానికి తరలించాల్సి ఉంది…
జిల్లాలో కోడి పందెములు/ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు తేది.11.01.2025 నుండి 18.01.2025 వరకు భారతీయ నాగరిక సురక్ష సంహిత, సెక్షన్ 163 అమలులో ఉంది…
జంతు సంక్షేమ చట్టాల కింద పసు సంవార్థక శాఖ ఎన్ని కేసులు నమోదు చేసిందో కోళ్లను రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించిందో వేచి చూడాల్సి ఉంది…
కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి…
కోడి పందాల నివారణకు హైకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సంయుక్త తనిఖీల బృందాలను ఏర్పాటు….
గ్రామస్థాయి బృందంలో సంబందిత గ్రామ రెవిన్యూ అధికారి, పంచాయతీ సెక్రటరీ, పోలీస్ కానిస్టేబుల్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఉంటారు…
మండలస్థాయి బృందంలో సంబందిత తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SI/CI), మండల పశుసంవర్ధక అధికారి/ పశువైద్యులు ఉంటారు…
డివిజినల్ స్థాయి బృందంలో సంబంధిత రెవిన్యూ డివిజినల్ అధికారి, డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, డివిజినల్ పంచాయతీ అధికారి సభ్యులుగా ఉంటారు…
పందాలు నిర్వహించినా, పందాలలో పాల్గొన్నా చట్టం ప్రకారం నేరమే…
Regards,
Vijay Naidu,
Advocate and Senior Legal Reporter.