అసలు కారణమిదే..

Get real time updates directly on you device, subscribe now.

కేటీఆర్, హరీష్‌రావును చుట్టుముట్టిన పోలీసులు.. అసలు కారణమిదే..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జనవరి 14: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా ముందుస్తుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పాడి కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై ఆది, సోమవారాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అడ్డుకొని, దాడికి యత్నించారని సంజయ్‌ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హరీష్‌రావు ఇంటికి పోలీసులు

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌తో కోకాపేట్‌లోని మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి పోలీసులు ఇవాళ(మంగళవారం) వెళ్లారు. హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. అలాగే హరీష్‌రావుతో పాటు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ (గచ్చిబౌలి) ఓరియన్ విల్లాస్ లోని కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.

బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసుులు

వరంగల్ : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అదుపులోకి రాయపర్తి పోలీసులు తీసుకున్నారు. తెల్లవారుజామునే వర్ధన్నపేట బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. పండగ పూట పోలీసుల అత్యుత్సాహం ఏంటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కౌశిక్ రెడ్డి విషయంలో హైడ్రామా చేశారు: బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు

కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అర్ధరాత్రి దాటాక ఒంటిగంటకు అరెస్ట్ చూపించారని బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు తెలిపారు. కౌశిక్ రెడ్డిని తిప్పి తిప్పి ఒక హైడ్రామా చేశారని మండిపడ్డారు. రెండు కేసుల్లో అరెస్ట్ చేసినట్టు చెప్పారన్నారు. ఒకటి ఆర్డీవో మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఎమ్మెల్యే సంజయ్ పీఏ ఇచ్చిన ఫిర్యాదును క్లబ్ చేసినట్లు చెప్పారని అన్నారు. రిమాండ్ షీట్‌లో ఇంకేమైనా మారుస్తారా తెలీదని చెప్పారు. ఈ రెండు కేసుల్లోనైతే బెయిల్ రావాలన్నారు. 41 సీఆర్పీసీకి విరుద్ధంగా రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపించిందని అన్నారు. సెక్షన్ 31, 32 కింద అరెస్ట్ చేసినట్లు చెప్పారని అన్నారు. వైద్య పరీక్షలు కూడా స్టేషన్‌లోనే చేశారన్నారు. ఇంకెప్పుడు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారంటే గంట, రెండు గంటలంటున్నారని బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment