హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/జనవరి 14: హిందువులు జరుపుకునే పండుగల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగ సంక్రాంతి. సాధారణంగా సంక్రాంతి జనవరి నెలలో వస్తుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతిని జనవరిలో జరుపుకోవడం వెనుక శాస్త్రం దాగి ఉంది. జనవరి నెలతో శీతాకాలం మొదలవుతుంది. అందువల్ల మనుషులతో పాటుగా అన్ని జీవరాసులలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే సంక్రాంతి పండుగ నెల ప్రారంభం అయిన వెంటనే బెల్లంతో కూడిన పిండి వంటలు చేస్తారు. బెల్లంలో ఐరన్, స్థూల, సూక్ష్మ పోషకాలు ఉంటాయి.