హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ జనవరి 14: ఏపీ ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి సెలవును మరో రోజు పొడిగించింది. కనుమ పండుగ రోజు (జనవరి 15) సాధారణ సెలవు ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జీవో విడుదల చేశారు.