ఇవాళ సా.6 గంటలకు..
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/జనవరి 14:
సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం 6-7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఇస్తుంది. ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఎన్నో దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది.