హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ ఆంధ్రప్రదేశ్/జనవరి 14: కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, వాయవ్య భారతం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్సుంది.