హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జనవరి 14: మకర సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక పండుగల విషయానికొస్తే గుమగుమలాడే పిండి వంటలు, స్వీట్లు పక్కాగా ఉండాల్సిందే. పండుగలప్పుడు ఏ ఇంట్లో అయినా చేసే వంటల వాసనను చూస్తేనే నోరూరుతుంది. మరి మకర సంక్రాంతి నాడు నువ్వుల లడ్డూలు, పల్లి పట్టి, మకర చౌలా, కిచిడి, చక్కెర పొంగలి లాంటివి తయారు చేస్తారు.