హైదరాబాద్‌లో దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్న ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్.
హైదరాబాద్‌లో దుకాణం ఓపెన్ చేసిన ఏపీ మంత్రి
శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు “గానా బజానా, కళా ప్రదర్శన”
వారంలో మూడు రోజులు హైదరాబాద్‌లోనే మకాం ప్రముఖ స్టార్ హోటల్‌లో దందాలు, సెటిల్‌మెంట్లు.
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రితో పనులున్నవారు, కీలక వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సినవారు ఆ హోటల్‌లో బారులు తీరాల్సిందే.
తెలంగాణ భూవ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్న మంత్రి సత్యప్రసాద్ శ్రుతి మించుతోందంటూ చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్‌లో ప్రతి శుక్రవారం ప్రముఖ స్టార్ హోటల్‌లో మంత్రి మకాం శనివారం మధ్యాహ్నం వరకు సెటిల్‌మెంట్లు.
మీ మంత్రిని జర చూసుకోండి. ఆయన ఇక్కడ చేస్తున్న పనులేవీ బాగోలేవు. తెలంగాణ భూముల వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు. సెటిల్‌మెంట్లకు కౌంటర్ తెరిచారు. మీరు కంట్రోల్‌లో పెట్టుకోండి. అ పనులేవో అక్కడే (ఏపీలో) చేసుకోమనండి అంటూ చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వ పెద్దలు మంత్రి అనగాని సత్యప్రసాద్ లీలలు, పనితీరుపై చంద్రబాబు పూర్తి నివేదిక తెప్పించుకున్నారని సమాచారం.