జర్నలిస్టులకు అండగా డబ్ల్యూ జే ఐ
మేడిపల్లి మండలంలో సన్నాహక సమావేశం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మేడిపల్లి/జనవరి 03: క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూ జే ఐ) అండగా నిలుస్తుందని యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ లు అన్నారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలంలో యూనియన్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిద్దరూ యూనియన్ ఆవిర్భవించిన తీరును, ఆవశ్యకతను వివరించారు. దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంస్థగా ఆవిర్భవించిన డబ్ల్యూజేఐ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వేగంగా విస్తరిస్త్తోందని తెలిపారు. ఈ సందర్భంగా మేడిపల్లి మండలంలో యూనియన్ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు బాధ్యతలను అప్పగించారు. త్వరలోనే మేడిపల్లి మండల కమిటీతో పాటు మేడిపల్లి మల్కాజిగిరి జిల్లా కమిటీని సైతం ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు. మేడిపల్లి నిర్మాణ కమిటీ బాధ్యులుగా ఉపేందర్, చంద్రశేఖర్, వెంకన్న, నరేందర్ లను నియమించారు. డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో నిర్వహించే జర్నలిస్టుల పురస్కార కార్యక్రమ బ్రోచర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ సమావేశంలో సురేష్ చౌదరి, శ్యాంసన్ జార్జ్, నందీష్, పిఎన్ శ్రీనివాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.