మనకో దిక్సూచి కావాలి… మనల్ని ముందుకు నడిపే చోదకశక్తి కావాలి…
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జనవరి 01:
ఏడాది అంటే కేవలం 365 రోజులు కాదు… ఇవి 365 అవకాశాలు. ప్రతీ రోజును ఒక అవకాశంగా మార్చి, మన కలలను వాస్తవం చేద్దాం. ఆరంభం ఎప్పుడూ ఇప్పుడు నుంచే. సాహసానికి వెనుకడుగు వద్దు, సాదించాలనుకున్న దాని పునాది ఇప్పుడే వేయాలి.
ప్రతి క్షణం మన జీవితం తృప్తిగా ఉంటేనే నిజమైన సఫలత.దానికి కావాల్సిన మార్గదర్శక శక్తి ఎక్కడి నుంచో రాదు… అది మన కలల నుంచి ఉద్భవిస్తుంది. మన లక్ష్యాల మీద మనకున్న నమ్మకంతో, దాని కోసం మనం చేసే కృషితో అది వికసిస్తుంది. ఆ శక్తి మన స్వయంకృషిలో ఉంది… ప్రతి విజయంలో కలిగే ఆనందంలో ఉంది.
ఈ కొత్త సంవత్సరం మీ జీవితం కోసం గొప్ప కథ రాయడానికి ఒక చక్కని అద్భుతమైన పునాది కావాలి. మీ లక్ష్యాలను చేరుకునే దారిలో ప్రపంచం మీ వెన్నంటే నిలుస్తుంది.
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క క్షణం ఆనంద భరితంగా కావాలని, కొత్త ఏడాదిలో కొత్త కోరికలన్నీ నెరవేరాలని, కొత్త ఆశయాలు, కొత్త నిర్ణయాలు, కొత్త వేడుకలు కలకాలం మీతోనే ఉండాలని మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్.
*హరిప్రసాద్ దూపాటి*-సామాజిక ఉద్యమకారుడు, సమాచార హక్కు పరిరక్షణ కర్త.