డిసెంబర్ 31న రాత్రి కోసం ప్రజలకు తెలియజేయునది ఏమనగా..
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/డిసెంబర్ 31: నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సందర్బంగా కమిషనరేట్ పరిధిలోని వైన్స్, కల్లు దుకాణాలకు రాష్ట్ర ప్రభుత్వము నుండి అనుమతి పొందిన సమయం వరకే మధ్యం విక్రయించవలెనని జిల్లా కమిషనర్ ఈ సందర్భంగా ప్రకటనలో పేర్కొన్నారు.
అలా కాకుండా ప్రభుత్వము నుండి అనుమతి పొందిన సమయం దాటిన తరువాత “మద్యం” విక్రయించిన లేదా ” మద్యం” విక్రయిస్తున్నట్లు తెలిసిన అట్టి షాప్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకొని వారి లైసెన్స్ ను రద్దు పరిచేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగు నివేధిక ను సమర్పించడం జరుగుతుంది.
అంతే కాకుండా బార్లు, రెస్టారెంట్లు, మొదలగు వాటిలో అనుమతి పొందిన సమయం మించి వినియోగదారులను అనుమతించి ఉండనివ్వరాదు. మరియు బార్లు, రెస్టారెంట్లు తెరచి ఉంచిన వారిపై కూడా చట్టపరంగా కఠిన చర్య తీసుకొనబడును.
ఎక్కడ కూడా పోలీస్ అనుమతి లేకుండా ప్రజలను భయాందోలనకు గురిఅయ్యే విధంగా క్రాకర్స్ మరియు ఆర్.కె స్ట్రా సౌండ్ సిస్టమ్ లేదా అత్యధిక మొతాదులో గల సౌండ్ సిస్టమ్ ( డి.జె ) ఏర్పాట్లు నిషేధించడం జరిగింది. ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో వృద్ధులు లేదా అనారోగ్యంతో బాదపడుతున్నవారికి ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం గలదు. తప్పక పోలీస్ అనుమతి ఉండవలెను.
నిజామాబాద్ నగరంలో ప్రత్యేకంగా 20 టీం లను ఏర్పాటు చేసి వాహానాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. మరియు మద్యం సేవించి వాహానాలు నడిపేవారిపై ద్విచక్ర వాహానం పై ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రయాణించినవారిపై, యం.వి యాక్ట్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. రాత్రి 12:30 తర్వాత ఎవ్వరైన రోడ్డు మీద ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నట్లయితే లేదా జనసంచారం ఉన్నట్లయితే వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొనబడును.
షాప్ లలో లేదా బహిరంగ ప్రదేశాలలో సిట్టింగ్ లు ఏర్పాటు చేసిన అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకొనబడును. ఈ రోజు రాత్రి వేడుకలు జరుపుకొనే ప్రజలు ఇతరుల స్వేచ్ఛకు భంగము కలుగకుండా ప్రవర్తించవలెను.
శాంతి భద్రతలకు భంగము వాటిల్లకుండా ప్రతీ పౌరుడు పోలీసులకు సహకరించవలెనని పేర్కొన్నారు.
సి. హెచ్. సింధు శర్మ, IPS.,
కమీషనర్ ఆఫ్ పోలీస్
నిజామాబాద్