హ్యూమన్ రైట్స్ టుడే/శ్రీకాకుళం జిల్లా/డిసెంబర్ 29:
* భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బి.వి. ప్రసాదరావు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, యువజన సర్వీసుల శాఖ / సెట్ శ్రీకాకుళం వారు తెలిపారు.
* ఇంటర్మీడియట్ / 10వ తరగతి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నుంచి 2025 జనవరి 07 నుంచి 2025 జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గం.లోగా https://agnipathvayu.cdac.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఇతర వివరములకు భారత వాయుసేన వారి వెబ్ సైట్ ను సందర్శించగలరు.
* 2005 జనవరి 1వ తేది నుండి 2008 జూలై 1వ తేది మధ్య పుట్టిన అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్ధులు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. ఆన్లైన్ టెస్టుకు 3 రోజుల ముందు అర్హత పరీక్ష అడ్మిట్ కార్డులు అభ్యర్థుల వ్యక్తిగత ఈ-మెయిల్సుకు వస్తాయని చెప్పారు.