తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం యేడాదిలోనే సాధించిన అద్భుత విజయం.
ముఖ్యమంత్రి చొరవ, నా కృషికి దక్కిన ఫలితం ఆర్ఆర్ఆర్ టెండర్లు.
ఇవ్వాల తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు.
ఆర్ఆర్ఆర్ తెలంగాణ బిడ్డల భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.
5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు.
టెండర్లు పిలిచిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ
27.12.2024 నుంచే అందుబాటులోకి వచ్చిన టెండర్లు
టెండర్ల దాఖలుకు చివరి తేదీ 14.02.2025 (11.30 గంటల)
14.02.2025 తేదీన టెండర్లు తెరవనున్న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ.
ఆర్ఆర్ఆర్ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి అనేకసార్లు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతులు సమర్పించాను.
2017 లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించినా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వెనకబడ్డ పనులు.
2023 డిసెంబర్ లో పదవీ చేపట్టిన నాటి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు కోసం నిరంతరం కృషి చేశా.
ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిగారితో కలిసి భూసేకరణపై అనేక సార్లు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాం.
ఓఆర్ఆర్ గేమ్ ఛేంజర్ అయితే, ఆర్ఆర్ఆర్ సూపర్ గేమ్ ఛేంజర్ కాబోతున్నది.
తెలంగాణ అభివృద్ధిలో ఆర్ఆర్ఆర్ కీలక భూమిక పోషించబోతున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి చేసిన కృషి ఫలించింది.
తెలంగాణలో గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగ్ రోడ్డు పనులు ఆలస్యం అయ్యాయి.
అప్పుడే యుటిలిటీ ఛార్జీలు చెల్లిస్తామని లేఖ ఇచ్చుంటే ఈపాటికి రీజినల్ రింగ్ రోడ్డు పట్టాలెక్కేది.
మా ప్రభుత్వం వచ్చాకా నేను స్వయంగా ముఖ్య మంత్రిని రిక్వెస్ట్ చేసి యుటిలిటీ ఛార్జీల చెల్లిస్తామని లేఖ రాశాం.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని వివరిస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు పెద్ద మనసు చేసుకొని యుటిలిటీ ఛార్జీలు కూడా కేంద్రమే చెల్లిస్తుందని హామి ఇచ్చారు.
టెండర్ వివరాలు
1వ ప్యాకేజీ:
గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని – 1529.19 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
2వ ప్యాకేజీ:
రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు వరకు 26 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని – 1114.80 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
3వ ప్యాకేజీ:
ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు వరకు 23 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని – 1184.81 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
4వ ప్యాకేజీ:
ప్రజ్ఞపూర్ నుంచి రాయగిరి గ్రామం వరకు వరకు 43 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని – 1728.22 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
5వ ప్యాకేజీ:
రాయగిరి గ్రామం నుంచి తంగడ్ పల్లి గ్రామం వరకు వరకు 35 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని – 1547.04 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
అదనపు సమాచారం :
5 ప్యాకేజీలుగా నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంపొడవు – 161.518 కిలోమీటర్లు, ఈ రోడ్డు నిర్మాణానికి 7,104.06 కోట్ల రూపాయలు మంజూరీ చేసిన కేంద్ర ప్రభుత్వం.