హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/డిసెంబర్ 29: రాష్ట్రంలో హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఐదు నెలల అనుభవాలతో వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి ఉందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారులు ఇచ్చిందని అన్నారు. ఇప్పటివరకు అధికారికంగా హైడ్రాకు 5800 ఫిర్యాదులు అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉందని వెల్లడించారు. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌పై కుడా దృష్టి పెట్టినట్లు చెప్పారు.
2025లో జియో ఫెన్సింగ్ సర్వే చేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 72 డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయి. నాగోల్‌లో ఉన్న డీఆర్ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. అంతేకాదు హైడ్రాకు త్వరలో ఒక FM ఛానల్‌కు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయ విక్రయాలపై అవగాహన పెరుగుతుందని అన్నారు. 2024 జులై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించారు.