జాతీయ లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కారం : జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి పి.శాంతి.
ఇద్దరు కక్షిదారుల రాజీతో, కాలం, డబ్బు ఆదా అవుతుంది..
ఆంధ్ర ప్రదేశ్/తిరుపతి జిల్లా/ హ్యూమన్ రైట్స్ టుడే:
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ రోజును పురస్కరించుకొని జూనియర్ సివిల్ జడ్జి పి.శాంతి ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి పి.శాంతి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ ప్లాట్ ఫారం ను వినియోగించుకుని త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. దీని ద్వారా కేసులు పరిష్కారం అవుతాయని,అదేవిధంగా కాలం,డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. కక్ష దారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా 208కేసులు(సెటిల్మెంట్) పరిష్కారం అయ్యాయని తెలిపారు. సివిల్, క్రిమినల్, పిట్టి కేసులు, బ్యాంక్ కేసుల పరిష్కారం ద్వారా రూ. 6,51,005/-రూపాయలు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గురుస్వామి నాయుడు, గౌరీ శంకర్ రాజు, మధుసూదన్ రెడ్డి, చంద్రమోహన్, అనూషా, పాకాల సి.ఐ రాజశేఖర్, కోర్టు కానిస్టేబుల్ దామోదర్, బాబు, కల్లూరు ఏ.ఎస్.ఐ రాజారెడ్డి, కోర్టు సిబ్బంది మీన, మధు, తదితరులు పాల్గొన్నారు.