దళిత కేంద్ర మంత్రివర్యులు సామాజిక న్యాయశాఖ మంత్రివర్యులు రాందాస్ అథావలేని ఉద్దేశపూర్వకంగా అవమానపరిచిన ఓయూ ఉపకులపతి రవీందర్ యాదవ్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉస్మాని యూనివర్సిటీ ఉపకులపతి ని ఉద్యోగం నుంచి తొలగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వలే) జాతీయ కౌన్సిలింగ్ మెంబర్ శివ నాగేశ్వరరావు గౌడ్ డిమాండ్ చేశారు?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
దళితులపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతి పక్షపాత దోరణి
గర్హనీయం
తీవ్రంగా ఖండించిన ఆర్పిఐ (అత్వలె) జాతీయ కౌన్సిలింగ్ నెంబర్ శివ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 3 న హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాందాస్ అతవాలేకి యూనివర్సిటీలోని సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్టి విషయాలపై కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రివర్యులు రామదాసు అత్వాలే ఫోన్ ద్వారా సంజాయిషీ అడిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి రవీందర్ యాదవ్ సంజాయిషీ ఇవ్వకుండా, అహంకారంతో ఫోన్ కట్ చేయడం జరిగింది. ఈ సంఘటనను రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అతవలే) జాతీయ కౌన్సిలింగ్ నెంబర్ శివ నాగేశ్వరరావు గౌడ్ చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఉపకులపతినీ ఉద్యోగం నుంచి తొలగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి రవీందర్ యాదవ్ మీద ఎస్సీ కమిషన్ కి, పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ కి ఆర్ పి ఐ (అత్వాలే) తెలంగాణ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. వెంటనే వీసీ ప్రెస్ మీట్ పెట్టి సంజాయిసి ఇవ్వాలి. లేనిపక్షంలో ఓయూ వీసీని ఉద్యోగం నుంచి తొలగించాలని భారతదేశ ప్రధానమంత్రికి ఈమెయిల్ ద్వారా పంపినామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిలింగ్ నెంబర్ శివ నాగేశ్వరరావు గౌడ్ అన్నారు.