మానవ హక్కులకు పెనుముప్పు
మానసిక ఆరోగ్యం, సైబర్ నేరాలు, వాతావరణ మార్పులపై రాష్ట్రపతి
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/డిసెంబర్ 11: మానసిక ఆరోగ్యం, సైబర్ నేరాలు, వాతావరణ మార్పులు వంటి సమస్యలు మానవ హక్కులకు ముప్పుగా మారాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ వృద్ధి చెందుతున్న గిగ్ ఎకానమీతో గిగ్ వర్కర్ల మానసిక ఆర్యోగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న విషయాన్ని వ్యాపారవేత్తలు గ్రహించాలని ఆమె సూచించారు. అలాగే కృత్రిమ మేధస్సు (ఎఐ) వినియోగం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలిపారు. మానవ జీవితాలకు ఎఐ వినియోగంతో మంచి, చెడు కూడా జరుగుతుందని చెప్పారు. డిజిటిల్ యుగం అభివృద్ది చెందుతున్న కొద్దీ సైబర్ బెదిరింపులు, డీప్‌ఫేక్‌లు, గోప్యతా సమస్యలు, నకిలీ సమాచారం వ్యాప్తి వంటి సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు.