మంచు మోహన్ బాబు పై కేసు నమోదు?

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 11:
మంగళవారం రాత్రి మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి జల్‌పల్లిలోని తన నివాసానికి రావడంతో వివాదం చోటుచేసుకుంది. తన ఏడు నెలల చిన్నారి లోపల ఉందని మనోజ్ విజ్ఞప్తి చేసినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారని, గేట్లకు తాళాలు వేసి వేసారట. బలవంతంగా లోపలికి వెళ్లడంతో పరిస్థితి మారిపోయింది.

కొద్దిసేపటికే మనోజ్ చిరిగిన చొక్కాతో, గాయాలతో కనిపించాడు. ఈ సమయంలో ఘటనను కవర్ చేసేందుకు మీడియా వారు వెళ్లారు. అదే సమయంలో మోహన్ బాబు ఓ జర్నలిస్టు మైక్ లాక్కొని వారిపై దాడికి పాల్పడ్డారూ. ఆ దాడిలో మీడియా ప్రతినిధికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది.

ఇందుకుగాను తాజాగా మంచు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఆయనపై 118 సెక్షన్ కింద షహర్ పహాడీ పీఎస్ లో కేసు నమోదు చేశారు. ఈ విషయానికి గాను మోహన్ బాబు వ్యతిగత విచారణకు హాజరు కావాలని రాచకొండ సీపీ నోటీసులు జారీ చేసారు.

అయితే ఒకవేళ మోహన్ బాబు నేరం చేసినట్టు రుజువైతే ఈ కేసుకు గాను మోహన్ బాబుకి మూడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీడియో జర్నలిస్టుల సంఘం మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని, డిమాండ్ చేస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment