తన ప్రతాపాన్ని మీడియా పై చూపడం దారుణం.

Get real time updates directly on you device, subscribe now.

మీడియా ప్రతినిధులపై సినీనటుడు మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము: ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిట్స్ యూనిటీ(APWJU)

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ డిసెంబర్ 11:
సినీనటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు టి.వి9 రిపోర్టర్ రంజిత్, మరో వీడియో జర్నలిస్టు సూర్యం పై మోహన్ బాబు దాడి చేయడాన్ని ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిట్స్ యూనిటీ (APWJU) తీవ్రంగా ఖండిస్తున్నాము.

తన కుటుంబంలో తెలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన నేపథ్యంలో మీడియా కవరేజ్ కి వెళ్ళగా జర్నలిస్టులపై మోహన్ బాబు భౌతిక దాడులకు దిగడం ఎంత మాత్రం సమంజసం కాదు.

తన ప్రతాపాన్ని మీడియా పై చూపడం దారుణం.

జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలనిఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిట్స్ యూనిటీ(APWJU) స్టేట్ ప్రెసిడెంట్ శివ శంకర్. చలువాది, వైస్ ప్రెసిడెంట్ శివ.చలువాది, సెక్రటరీ ఎండి. రాజాక్ ట్రెజరర్ పణితి.రత్న కుమార్ ,డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో యూనియన్ తరపున ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దాకా పోరాడుతామని హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment