హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 10: మంచు ఫ్యామిలీ రచ్చ రోడ్డుకెక్కింది. తాజాగా జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. అనంతరం లోపలి వెళ్లిన మీడియా పై మోహన్ బాబు, అతని అనుచరులు దాడి చేశారు.
మీడియా పై మోహన్ బాబు అరాచకం సృష్టించారు. మీడియా ప్రతినిధి పై మోహన్ బాబు దాడి చేశారు. జల్ పల్లి లోని మంచు టౌన్ దగ్గర మంచు మనోజ్ హంగామా చేశారు. లోపల ఏం జరుగు తుందో తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల పై మోహన్ బాబు దాడి చేశారు.
మీడియా ప్రతినిధుల మైక్ లాక్కొని మీడియా పై దాడి చేశారు మోహన్ బాబు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. కోపాన్ని ఆపుకోలేక మీడియా ప్రతినిధుల పై దారుణంగా దాడి చేశారు.
మోహన్ బాబు పై మనోజ్.. అలాగే మనోజ్ పై మోహన్ బాబు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన భార్య పిల్లల పై దాడి చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు.