హ్యూమన్ రైట్స్ టుడే/ ఆంధ్రప్రదేశ్/డిసెంబర్ 08:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్ల తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ పాలనలో దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో భారీగా అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా జిల్లాకు ఒక గ్రామ/వార్డు సచివాలయాన్ని ఎంపిక చేస్తారు. తనిఖీలకు పక్క మండలానికి చెందిన అధికారులను నియమించనున్నారు. ఒక్కో తనిఖీ బృందం 40 పింఛన్లను మాత్రమే పరిశీలిస్తుంది.