సమగ్ర సర్వే పూర్తి… కోటి 14 లక్షల కుటుంబాల డేటా రెడీ!
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/డిసెంబర్ 08: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత నెలలో మొదలుపెట్టిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ దాదాపు 100 శాతం ఇండ్ల సర్వే పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 17 లక్షల 47 వేల ఇండ్లకు స్టిక్కరింగ్ చేశారు. ఇందులో కోటి 14 లక్షల ఇండ్ల వరకు సర్వే పూర్తి చేసినట్టు తెలిసింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే కేవలం రెండున్నర లక్షలలోపు ఇండ్లు మాత్రమే మిగిలినట్టు తెలుస్తున్నది.