మీడియా లేకపోతే, మీరు ఉన్న మాటే ప్రజలకు ఎలా తెలుస్తుంది?

Get real time updates directly on you device, subscribe now.

రాజకీయ నాయకుల యాడ్స్‌ నిర్లక్ష్యం: విలేకరుల కృషిని అవమానపరుస్తున్న తీరు..

మీడియా లేకపోతే, మీరు ఉన్న మాటే ప్రజలకు ఎలా తెలుస్తుంది?

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ డిసెంబర్ 07:
డిసెంబర్ రాగానే ప్రతి విలేకరి తన సంస్థకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో, రాజకీయ నాయకుల కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటాడు. సంస్థకు ఆర్థిక స్థిరత్వం తెచ్చేందుకు వారు చేసే ఈ కృషిని, రాజకీయ నాయకులు తమ నిర్లక్ష్య ధోరణితో అవమానపరుస్తున్నారు.

తమ ప్రచారానికి ఫ్రీ సేవలు:
సంవత్సరమంతా, జర్నలిస్టులు రాజకీయ నాయకుల కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రభుత్వ ప్రాజెక్టులు—వీటన్నింటినీ మీడియా ఎత్తిపొడుస్తుంది. కానీ డిసెంబర్ నెలలో యాడ్స్‌ కోసం అడిగితే, నాయకులు తమ స్వార్థమే ముందు పెట్టుకుని జర్నలిస్టుల్ని ‘రేపు రా, మాపురా’ అంటూ తిప్పడం మాత్రమే చేస్తారు.

నిర్లక్ష్యపు ధోరణి:
రాజకీయ నాయకులు పత్రికా స్వేచ్ఛను ఉపయోగించుకోవడంలో మాత్రం ముందుంటారు. కానీ, విలేకరుల నిస్వార్థ కృషికి గౌరవం ఇవ్వడం, సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహకరించడం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తున్నారు. మేం సపోర్ట్ చేస్తాం అంటూ మాటలు చెబుతూ, ఆచరణలో మాత్రం తీరుతెన్నులు చూపడం లేదు.

యాడ్స్ కోసం విలేకరుల ఆరాటం:
ప్రతి విలేకరి డిసెంబర్ రాగానే యాడ్స్ కోసం తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి నాయకుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వైనం చూస్తుంటే, రాజకీయ నాయకుల తీరుపై కోపం కట్టలు తెంచుతుంది. సంస్థలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నడుస్తున్న జర్నలిస్టులపై ఈ విధమైన వ్యవహారం సరైనదా?

నాయకులు తీరును మార్చుకోవాలి:

రాజకీయ నాయకులు జర్నలిస్టుల కృషిని గౌరవించకపోతే, అది మరింత నిరాశ కలిగించే అంశంగా మారుతుంది. మీరెందుకు ఉన్నారు? మీ ప్రచారానికి మీరు బతిమాలే మీడియాను చివరికి తిరస్కరిస్తారా? అనే ప్రశ్నలు వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జర్నలిస్టుల హక్కులకు గౌరవం ఇవ్వడం, వారి కృషికి సరైన ప్రతిఫలం ఇవ్వడం రాజకీయ నాయకుల బాధ్యత.

మీ నిర్ణయాలను గౌరవించే ముందు, మీ వైఖరిని మార్చుకోవడం రాజకీయ నాయకుల బాధ్యతగా ఉండాలి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment