హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/డిసెంబర్ 07: పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6,000ల మొత్తాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర మంత్రి రామ్నాథ్ వెల్లడించారు. ట్యాక్స్ పేయర్స్,ఉన్నతాదాయ వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ స్కీమ్ కింద లబ్ధి పొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు రికవరీ చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 18 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. AUG-NOV కాలానికి 9.58 కోట్ల మందికి రూ.20,657 కోట్లు చెల్లించామన్నారు.