తెలంగాణ సర్కార్ మరో శుభవార్త.. త్వరలోనే 8,000 వీఆర్ఓ పోస్టులకు నోటిఫికేషన్.. ఈ సారి అర్హతలు ఇవే..!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 07: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీఆర్ఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు సర్కార్. ఈ నేపథ్యంలో వీఆర్ఓ బాధ్యతలను చేపట్టాలంటే అందుకు కావాల్సిన అర్హతలు, వారికి అందించే వేతనాలు, వారికి ఉండే బాధ్యతలు వంటి వివరాలు తెలుసుకోండి.
ప్రాధాన బాధ్యతలు: వీఆర్ఓలు గ్రామ స్థాయిలో భూ పత్రాల నిర్వహణ, ఆదాయ పత్రాలు సేకరించడం, మృతి, వివాహం, జననం వంటి ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించి ధృవీకరణ పత్రాలను జారీ చేయడం, భూ పన్ను సేకరణ మొదలైనవి వారి పనులు. అంతేకాకుండా, గ్రామంలో ఉండే భూములు, ఆస్తులు, వాటి పరిచయాలు గురించి సరికొత్త సమాచారం సేకరించడం కూడా వీఆర్ఓలకు ఉండే బాధ్యతల్లో ఒకటి.
కావాల్సిన జ్ఞానం: భూ సంబంధిత చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, గ్రామ పన్నుల వంటి విషయాల గురించి అవగాహన ఉండాలి.
వీఆర్ఓ అభ్యర్థులు సాధారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పనిచేస్తారు. గ్రామస్థాయి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ ఉద్యోగం గ్రామస్థాయిలో ప్రజలతో నేరుగా పని చేయడం వల్ల వారికి ప్రభుత్వ విధానాలు చేరవేసేందుకు సహాయపడుతుంది. వీఆర్ఓ ఉద్యోగం గ్రామంలో ప్రజలకు సహాయం చేసేందుకే కాకుండా గ్రామాభివృద్ధికి దోహదం చేయడంలో కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది.
వయోపరిమితి: 18 నుంచి 44 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు, ఇంటర్ లేదా డిగ్రీ చదివినవారు అర్హులు.
ఎంపిక విధానం: రాత పరీక్షతో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.