హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ డిసెంబర్ 07 : ఫెంగల్ తుఫాను తీరం దాటడంతో ఇప్పట్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండవని అంతా భావిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వెల్లడించింది. 12వ తేదీ నాటికి తమిళనాడు-శ్రీలంక తీర రేఖకు చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది.
వచ్చే రెండ్రోజులు వర్షాలు
రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. వచ్చే వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోవని తెలిపింది.