రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి- పి.డి ఎస్.యు డిమాండ్

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కర్క గణేష్ పి. డి.ఎస్.యు నిజామబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, యూనివర్సిటీ కన్వీనర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. ప్రాథమిక విద్యావ్యవస్థ నుండి యూనివర్సిటీల వరకు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయకపోవడం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం ప్రభుత్వపు సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, సంక్షేమ హాస్టల్లో, యూనివర్సిటీలలో విషపూరితమైన భోజనంతోటి విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని వ్యక్తం చేశారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ కేజీ టు కేజీ ఉచిత విద్య అన్న అన్నారు, కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఉచిత విద్య అన్న ఊసే కనబడటం లేదని తెలియజేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ ఛార్జీలు మరియు కాస్మోటిక్ ఛార్జీల బకాయిలను వెంటనే విడుదల చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్లో,యూనివర్సిటీ విద్యార్థులకు అనుగుణంగా హాస్టల్ భవనాలు నిర్మించాలని అన్నారు. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులకు 3000 రూపాయలు పరిశోధక విద్యార్థులకు 10,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగా 30 శాతం నిధులు కేటాయించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని, ఏ విద్యార్థి ఉద్యోగుల అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను అదే స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాలతో విద్యారంగాన్ని కూడా కాపాడుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పి. డి.ఎస్.యు ఉపాధ్యక్షులు ఎస్.కే అషూర్, అనిల్ ,జిల్లా నాయకులు మహిపాల్ శంకర్,, వినయ్,శృతి, స్ఫూర్తి, వెంకటేష్,రాకేష్,మణికంఠ, సాయి ప్రకాష్, భార్గవి వర్షిని, లతోపాటు ప్రొఫెసర్లు నజీర్, ప్రిన్సిపల్ హారతి, బాలశ్రినివస మూర్తి, రమణ చారి, నాగరాజు,స్వప్న, దత్త హరి, స్వామి, రవీందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment