పెద్దపెల్లి జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపల్లి/డిసెంబర్ 05: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేడు జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిజంలో చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే వివక్షకు తావివ్వకుండా అక్రిడేషన్ నాన్ అక్రిడేషన్ అనేటువంటి వ్యత్యాసం లేకుండా అందరూ కూడా సమానమే అనేటువంటి వ్యవస్థ కొరకు డి జే ఎఫ్ పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు. అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టుకు రావలసిన అన్ని ప్రయోజనాలను వర్తింపచేయాలని డి జె ఎఫ్ తరఫున అలుపెరుగని పోరాటం చేస్తున్నామని తెలిపారు. సామాన్య ప్రజలకు సైతం డి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ తరఫున న్యాయం జరిగేంత వరకు వారి తరఫున పోరాడుతామని డిజె ప్రెస్ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యం అదేనని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సబితం లక్ష్మణ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోలా శ్రీనివాస్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లయ్య మహర్షి, సింగరయ్య గోపాల్ రెడ్డి రాజమౌలి జిల్లా అధ్యక్షుడు కల్లపల్లి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కన్నూరి రాజు, మాతంగి శివరాజ్, ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్, పోలుదాసరి రజిత మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment