హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 05:
పుష్ప 2 సినిమా చూసేం దుకు అల్లు అర్జున్ బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని సంధ్య థియేటర్ కు వచ్చాడు.
అల్లు అర్జున్ వస్తున్నాడన్న సమాచారం అందుకున్న అభిమానులు ఆయన్ని చూసేందుకు భారీ సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు. దీంతో థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ తొక్కిసలాటలో తల్లి కొడుకులు తీవ్రంగా గాయపడి అస్వస్థతకు గురయ్యారు.
ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తోన్న చిక్కడపల్లి ఎస్సై రాజు నాయక్, ఎస్సై మోనికా తమ సిబ్బందితో కలిసి వారికి రక్షణగా నిలిచి సీపీఆర్ చేశారు.
ఆ తరువాత వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రేవతి అనే 35 ఏళ్ల మహిళ మృతి చెందాగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.