హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/ఆంధ్రప్రదేశ్/కర్నూలు/డిసెంబర్ 04: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సూచించారు. అమరావతి సచివాలయంలో న్యాయశాఖ కార్యదర్శిగా ప్రతిభాదేవి బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు ఫ్యామిలీ కోర్టు, జిల్లా 4వ అదనపు సెషన్స్ జడ్జిగా పని చేస్తున్న ఆమెను ప్రభుత్వం న్యాయశాఖ కార్యదర్శిగా నియమించింది. బుధవారం ఈ సందర్భంగా ఆమెను మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి అభినందనలు తెలిపారు. అనంతరం హైకోర్టు బెంచ్ ఏర్పాటును వేగవంతం చేయడానికి చేయాల్సిన కసరత్తుపై చర్చించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే న్యాయ సేవలు సీమ ప్రజలకు చేరువకానున్నాయని పేర్కొన్నారు.