రైతుల నిరసన ఎఫెక్ట్..

Get real time updates directly on you device, subscribe now.

ఎక్స్‌ప్రెస్‌వేపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/డిసెంబర్ 02: యునైటెడ్ కిసాన్ మోర్చా ఢిల్లీ మార్చ్ ప్రకటించింది. దీంతో ఈరోజు నోయిడా నుంచి రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు సోమవారం మహామాయ ఫ్లైఓవర్ కింద నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేని పూర్తిగా అడ్డుకున్నారు. ఈ నిరసనతో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో, ఆ ప్రాంతంలో వాహానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని పరిష్కరించి ఎక్స్‌ప్రెస్‌వేను తిరిగి కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రస్తుతం నిరసనకారులతో చర్చలు జరుపుతున్నారు.

కొనసాగుతున్న నిరసన

ఢిల్లీకి వెళ్లేందుకు రైతు సంఘాలు మొండిగా ఉన్నాయి. నోయిడా నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ వరకు రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్‌లో ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం పరిహారం, ప్రయోజనాల కోసం రైతు సంస్థలు తమ ఐదు ప్రధాన డిమాండ్లను అమలు చేయాలని కోరుతున్నాయి. రైతుల నిరసన కారణంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించడంతో పాటు పోలీసులు పలు చర్యలు చేపట్టారు. దీంతో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ఆఫీసుకు ఆలస్యం

ఢిల్లీ నోయిడా సరిహద్దులో తీవ్ర ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో అనేక మంది ప్రజలు చాలా ఆలస్యంగా కార్యాలయాలకు చేరుకుంటున్నారు. మరోవైపు నోయిడాలో ట్రాఫిక్‌ జామ్‌ దృష్ట్యా ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో పోలీసులు భద్రతను పెంచారు. రైతుల కవాతు దృష్ట్యా నోయిడా పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. రద్దీ దృష్ట్యా నోయిడా, గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్లే, ఢిల్లీ నుంచి వచ్చే డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలా చేయకపోతే ప్రజలు తీవ్ర ట్రాఫిక్ జామ్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఢిల్లీకి వచ్చే కొన్ని మార్గాలను ట్రాఫిక్ పోలీసులు మూసివేసి దారి మళ్లించారు.

అనేక మార్గాల్లో ట్రాఫిక్

ఢిల్లీకి పాదయాత్ర చేయాలంటూ రైతులు పిలుపునివ్వడంతో జీరో పాయింట్ వద్ద పోలీసులు బారికేడ్లు వేసి తనిఖీలు చేస్తున్నారు. దీంతో పాటు కస్నా, దాద్రి తదితర మార్గాల నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో బారికేడ్లు వేసి అడ్డుకుంటున్నారు. తనిఖీల కారణంగా పలు కూడళ్లలో ట్రాఫిక్‌ పెరిగింది. పలువురు రైతు నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. ఢిల్లీకి వెళ్లకుండా రైతులను అడ్డుకునేందుకు నాలుగు వేలకు పైగా పోలీసు బలగాలు రోడ్లపైకి వచ్చాయి.

రైతు ఉద్యమం కారణంగా ఆన్‌లైన్ క్లాసేస్

ఢిల్లీకి రైతుల పాదయాత్ర సందర్భంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్‌ల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం నోయిడా, గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని పలు పాఠశాలలు సోమవారం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. నోయిడా, DPS 30, DPS 122, గ్రేటర్ నోయిడా వెస్ట్ DPS, స్పర్ష్ గ్లోబల్ స్కూల్‌తో సహా అనేక పాఠశాలలు నేడు ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నాయి. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment