ఇవాళ పాఠశాలలు బంద్‌ ..!!

Get real time updates directly on you device, subscribe now.

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్‌..ఇవాళ పాఠశాలలు బంద్‌ ..!!

హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్ నవంబర్ 30: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్‌..ఇవాళ పాఠశాలలు బంద్‌ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా పుడ్ ఫాయిజన్ ఘటనలు జరుగుతున్నా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదు.

ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి అన్నారు. విద్యార్థులు చనిపోతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు సమస్యలతో సతమతం అవుతున్నాయి. రక్షణ కరువై, పర్యవేక్షణ లేకుండా పోతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమైన విద్యారంగానికి మంత్రి లేకుండానే 1 సంవత్సరం గడిచిపోతుంది.

ఈ సమస్యలు పై కనీసం సమీక్ష చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయింది. అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది ఎస్ఎఫ్ఐ. తక్షణమే ముఖ్యమంత్రి విద్యాశాఖ, వసతిగృహాలు,గురుకులాలు, కెజిబివిలపై రివ్యూ చేసి, సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తోంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యపై ఎస్ఎఫ్ఐ పోరాడుతుంది. ఇవాళ్టి బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుంది అని మూర్తి పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment