హ్యూమన్ రైట్స్ టుడే/ఇంటర్నెట్ డెస్క్/నవంబర్ 26: ప్రధాని మోడీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా అధికారులు అధికారికంగా 297 పురాతన, విలువైన వస్తువులను భారత్‌కు అందజేశారు. ప్రధాని మోడీ అమెరికా సందర్శనకు వెళ్లినప్పుడు 2021లో 157, 2023లో 105 పురాతన వస్తువులు భారత్‌కు తిరిగి వచ్చాయి. వీటిలో తూర్పు భారతంలోని టెర్రకోట బొమ్మలు, కళాకృతులు, ఇతర ప్రాంతాల్లోని రాతి, లోహ, కలప, ఐవరీ శిల్పాలు ఉన్నాయి.