హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/నవంబర్ 26: ఆస్పత్రిలో చేరిన ఆర్‌బీఐ గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో చెన్నైలోని క్రీమ్స్ రోడ్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయనకు సీనియర్ వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. డిసెంబర్ 2018 నుండి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉన్న శక్తికాంత దాస్ పదవీకాలం డిసెంబర్ 10, 2024తో ముగుస్తుంది.