క్విక్‌ కామర్స్‌ ఎఫెక్ట్‌తో 67 శాతం

Get real time updates directly on you device, subscribe now.

దేశ దర్మం కోసం ఇక కిరాణా షాపులు ఉండవు.. సంచలన పరిణామం.. దెబ్బ ఎవరికంటే?

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 25: ఒకప్పుడు ఊరికి ఒక కిరాణా కొట్టు ఉండేది. శావుకారి దగ్గరకు వెళ్లి అవసరం అయిన సరుకులు తెచ్చుకునేవారు. పట్టణాల్లో మాత్రమే కొన్ని షాపులు ఉండేవి తర్వాత కిరాణా వ్యాపారం విస్తరించింది. గ్రామాల్లో కూడా పది వరకు కిరాణా షాపులు కనిపిస్తున్నాయి. ఇక పట్టణాల్లో అయితే వీధికి ఒకటి, రెండు కిరాణా షాపులు ఉంటున్నాయి. ఈ వ్యాపారంతో లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. అయితే సూపర్‌ మార్కెట్లు, స్పెన్సర్, డీమార్ట్, హెరిటేజ్‌ లాంటి షాపింగ్‌ మాల్స్‌ రాకతో కిరాణా వ్యాపారంపై ప్రభావం పడింది. చాలా వరకు కిరాణా దుకాణాలు మూత పడ్డాయి. చాలా మంది మాల్స్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపుతుండడం, ఆఫర్లు ఇస్తుండడంతో గ్రామీణుల కూడా సమీపంలోని పట్టణాలు, నగరాల్లోని సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌కు వెళ్లి ఒకేసారి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆన్‌లైన్‌ మార్కెట్‌ (ఈ కామర్స్‌) వ్యాపారం విస్తరిస్తోంది. ఇంట్లో ఉండే సరుకులు ఆర్డర్‌ చేస్తున్నారు. సరుకులు ఇంటికే వస్తున్నాయి. దీంతో విధుల్లో బిజీగా ఉండేవారు. షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లే తీరిక లేనివారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో సరుకులు ఆర్డర్‌ చేస్తున్నారు. అమెజాన్, రిలయ్స్, హెరిటేజ్‌తోపాటు అనేక ఈకామర్స్‌ సంస్థలు ఆఫర్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో కిరాణా షాపులు మరింత కుదేలయ్యాయి. షాపింగ్‌ మాల్స్‌పైనా ప్రభావం పడింది.

క్విక్‌ కామర్స్‌…
ఇక ఇప్పుడు క్విక్‌ కామర్స్‌ దూకుడు కనబరుస్తోంది. వేగంగా విస్తరిస్తోంది. దీంతో 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయి. ఆర్డర్‌ చేసిన 10 నిమిషాల్లో ఇంటికి సరుకులు వస్తున్నాయి. దీంతో క్విక్‌ కామర్స్‌ సంస్థలకు ఆదరణ పెరుగుతోంది. కొత్తగా వస్తున్న సంస్థలు ఆఫర్స్‌ ఇస్తున్నాయి. దీంతో వినియోగదారులు క్విక్‌కామర్స్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా కిరాణా దుకాణాల్లో అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.

రూ.10 వేల కోట్ల విక్రయాలు
క్విక్‌ కామర్స్‌ దూకుడు ఎలా ఉందంటే ఒక్క ఏడాదిలోనే కిరాణా దుకాణాల నుంచి రూ.10,700 కోట్ల విక్రయాలు క్విక్‌ కమార్స్‌ చేతికి వెళ్లాయి. ఇక కిరాణా షాపుల్లో కొనుగోళ్లు తగ్గించామని 46 శాతం మంది వినియోగదారులు వెల్లడించారు. తాము క్విక్‌ కామర్స్‌వైపు మళ్లామని పేర్కొన్నారు. ప్రస్తుతం క్విక్‌ మార్కెట్‌లో టాటా సంస్థ బిగ్‌ బాస్కెట్, జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టిమార్ట్, జెపన్టో, జియో మార్‌ వంటి సంస్థలు ఉన్నాయి. నిమిషాల్లో సరుకులు డెలివరీ చేస్తున్నాయి. క్విక్‌ కామర్స్‌ ఎఫెక్ట్‌తో 67 శాతం విక్రయాలు తగ్గాయని వర్తకులు పేర్కొంటున్నారు. కేవలం 5 శాతం మంది ఇప్పటికీ కిరాణా షాపుల్లోనే కొనుగోళ్లు చేస్తున్నారు.

ఖర్చులు తగ్గాయ్‌..
క్విక్‌ కామర్స్, ఈ కామర్స్‌ సంస్థల కారణంగా విక్రయాలు తగ్గడంతోపాటు వినియోగదారుల వృథా ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. దీంతో చాలా మంది ఈ సంస్థలనే ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా కిరాణా దుకాణాల నిర్వహణ భారం అవుతోంది. డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకుంటూ వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్‌లైన్‌ వ్యవస్థలను అందిపుచ్చుకోవడంలో డాబర్, మారికో, హెచ్‌ఏయూఎల్, గోద్రెజ్‌ కన్జూమర్స్‌ ప్రొడక్ట్‌ వంటి సంస్థలక సవాల్‌గా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment