మనల్ని మనం అవమానపరచుకొని మనల్ని మనం వేరుగా చూసుకునే ఈ సాంప్రదాయాలు అవసరమా… ఈ ఆచారాలు ఉండాలా..
తగల బెట్టండి ఈ ఆచారాలను – శ్రీదేవి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 25: ఇంటి ప్రక్కన ఉన్నవారు వారి ఇంట్లో ఏదో పూజ ఉంది అని నన్ను నా మిత్రులను భోజనానికి పిలిచారు. సాధారణంగా నేను వెళ్ళను నా స్నేహితులు బలవంతంపై వెళ్ళక తప్పలేదు. వాళ్ల ఇంటికి వెళ్ళగానే రండి రండి అంటూ మమ్మల్ని లోపలికి నవ్వుతూ ఆహ్వానించారు. వెళ్లిన మా ముగ్గురిలో ఒకరిని కుర్చీలో కూర్చోబెట్టి కుంకుమ పెట్టి ఒక పువ్వు ఇచ్చి పసుపు కూడా ఇచ్చి గంధం మెడికి రాశారు. నా మొహం గానీ నా వెంట వచ్చిన మరొక మిత్రురాలి మొహం గాని ఇద్దరినీ వాళ్లు దేఖ నైన దేక లేదు. దానికి కారణం మా ఇద్దరికీ భర్తలు లేరు. ఆ సంగతి మాకు తెలుసు అలా జరుగుతుందని తెలుసు. ఇలాంటి వాళ్లని వెలివేయాలని విపరీతమైన కోపం వస్తుంది. అయినా వాళ్లయితే మా శత్రువులు కాదు. భోజనాలు అయిన వెంటనే మళ్ళీ నా స్నేహితురాలికి కాళ్ళకి పసుపు రాసి దాని చేతికి ఒక ఆకు, ఒక్క ,అరటిపండు ఇచ్చారు, మా చేతికి ఒక జామ పండు ఇచ్చారు. ఇది కొత్త కాదు ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఈ చెత్త ఆచారాలను పెట్టిన చెత్త కొడుకు ఎవడో గానీ తొక్క తీయాలనిపిస్తుంది. భర్త ఉంటే ఒకలాగా భర్త పోతే మరొక లాగా చూసే ఈ సమాజంలో సాంప్రదాయాలతో మహిళలను అవమానించే ఈ ఆచారాలు ఎప్పుడు తగలబడిపోతాయా అనిపిస్తుంది. పువ్వులు గాజులు, బొట్టు చిన్నప్పుడు అమ్మ పెట్టినవే. భర్త వచ్చిన తర్వాత వచ్చినవి కావు. అతను పోతే ఇవన్నీ ఎందుకు దూరం కావాలి ఎందుకు మహిళలను వేరు చేసి చూడాలి కనీసం ఇప్పటి మహిళలు అయినా ఇలాంటి ఆచారాలుకి వ్యతిరేకంగా ఆలోచన చేయాలి. భర్త చనిపోతే పూలు పెట్టుకుంటే ఎవడితోనో తిరుగుతుంది అని అనుకుంటారని మహిళలు చాలా భయపడతారు. ఒక మహిళ తను ఎవరి దగ్గర పెరగాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో పడుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి, ఏ పనులు చేయాలి అని ఎవడో ముందే రాసిపెట్టారు. ఇవి ఆచారాలు మన సంస్కృతి అని పదే పదే నూరి పోశారు ఇది మన సంస్కృతి కాదు. మను సంస్కృతి వీటిని తగల పెట్టకపోతే మళ్లీ వేల సంవత్సరాల వెనక్కి ఈ మహిళలతోనే సంస్కృతి పేరుతో తీసుకొని వెళ్లే ప్రమాదం లోనే సమాజం ఉంది. భర్తలు చనిపోయేది మన తల్లులకు మన బిడ్డలకు మన ఆడపిల్లలకు మన తోబుట్టువులకే మనల్ని మనం అవమానపరచుకొని మనల్ని మనం వేరుగా చూసుకునే ఈ సాంప్రదాయాలు అవసరమా… ఈ ఆచారాలు ఉండాలా.. మనతోపాటు వుండే మిత్రుల్ని భర్తలు చనిపోతే వారిని ఒకలాగా భర్త వున్నవారిని వకలాగ చూసేటటువంటి ఈ అసమానతలు లేక వెనుకబాటుతనాన్ని మనం ఎందుకు ప్రశ్నించకూడదు. అన్ని మారుతున్నప్పుడు ఇది ఎందుకు మారవు. అంటరానితనం కన్నా హీనంగా మహిళల్ని చూడబడడం అత్యంత దారుణo. మహిళకు ఒక గుర్తింపు గౌరవం కేవలం బొట్టు పూలు పసుపు కుంకుమ వీటితో ఎట్లా కొలుస్తారు. భర్త చనిపోయినటువంటి మహిళలను పూజలకి ముందుగానీ ఏదైనా శుభకార్యాలకి కూర్చోబెట్టడం గాని ఏమన్నా పనులు చేయిపించడం కానీ అశుభంగా తలిచే ఇలాంటి పూజలు, సాంప్రదాయాలు అవసరమా…మహిళలు ఇలాంటి వాటిని ప్రశ్నించే రోజే ఇంకా చెప్పాలంటే వీటిని వెలివేసిన రోజే ఈ సమాజం బాగుపడుతుంది.