అమ్మో.. ఫారం కోళ్ల!! డేంజర్!!

Get real time updates directly on you device, subscribe now.

సరిగ్గా ఉడికిస్తే బ్యాక్టీరియా నాశనం..

యాంటీ బయాటిక్స్ అతి వినియోగంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి..

పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా..!!

ఎన్ఐఎన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడి..

తెలంగాణ, కేరళలో అధ్యయనం..

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ నవంబర్ 25: తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీ బయాటిక్స్ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ (ఎన్ఐ ఎన్) సైంటిస్టులు గుర్తించారు.

పౌల్ట్రీ ఫామ్స్ లో కోళ్లకు అవసరమున్నా, లేకపోయినా యాంటీ బయాటిక్స్ విచక్షణరహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) వృద్ధి చెందుతున్నదని నిర్ధారించారు. ఇలాంటి చికెన్ను సరిగ్గా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యువు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదముందని హెచ్చరించారు.

సరిగ్గా ఉడికిస్తే బ్యాక్టీరియా నాశనం..

కేరళను సౌత్ జోన్ గా, తెలంగాణను సెంట్రల్ జోన్ గా విభజించి ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీఫామ్స్ లోని 131 శాంపిళ్ల (కోడి రెట్టల)ను సేకరించి, వాటి నుంచి డీఎన్ఏను వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. ఈ కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ ఆరియస్తో పాటు క్లాస్ట్రిడియం పెర్‌ఫ్రింజెన్స్, క్లేబ్సియెల్లా ఎంటరోకోకస్ ఫెకాలిస్, సూడోమోనాస్ ఎరుగినోసా, బాక్టీరియోడ్స్ ఫ్రాజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఆనవాళ్లను సైంటిస్టులు కనుగొన్నారు.

ఇవన్నీ మన దేశంలో యాంటీ బయాటిక్‌ ట్రీట్ మెంట్కు సవాల్ విసిరే బ్యాక్టీరియాలేనని ఎన్ఐఎన్ డ్రగ్స్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు డాక్టర్ షోబీ వేలేరి, సంయుక్త కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి చికెన్ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95 శాతం బ్యాక్టీరియా నాశనమవుతుందని తెలిపారు. తెలంగాణతో పోలిస్తే కేరళలోనే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) జన్యువు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

యాంటీ బయాటిక్స్ కు ఏఎంఆర్ సవాల్ విసురుతుందని ఈ రీసెర్చ్ కు నేతృత్వం వహించిన డాక్టర్ షోబీ వేలేరి అన్నారు. ”కేరళ, తెలంగాణలోని పలు పౌల్ట్రీ ఫామ్‌ల నుంచి కోడి రెట్ట సేకరించాం. ఇందులో జన్యు సంబంధమైన డీఎన్ఏను వేరు చేశాం. ఇందులో ప్రాణాంతక బ్యాక్టిరీయా జన్యువులు యాంటీ బయాటిక్స్ ను తట్టుకునే అదనపు పొరను కలిగి ఉండడం గమనించాం. ఈ బ్యాక్టీరియా న్యుమోనియా, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి గురి చేసి ట్రీట్ మెంట్ కు సవాల్ గా మారనుంది” అని వెల్లడించారు.

ప్రజారోగ్యానికి హాని కలిగించే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) పర్యావరణ వ్యవస్థలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తక్షణమే అరికట్టాల్సి ఉందన్నారు. కాగా, సైంటిస్టులు డాక్టర్ షోబీ వేలేరి, డాక్టర్ అజ్మల్ అజీమ్, పర్తి సాగర్, నేరెళ్లపల్లి సంయుక్త కుమార్ రెడ్డి రాసిన ఈ రీసెర్చ్ పేపర్ ‘కంపారిటివ్ ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌’ అనే ఇంటర్నేషనల్ జర్నల్ లో ‘ది యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రొఫైల్ ఇన్ పౌల్ట్రీ ఆఫ్ సెంట్రల్ అండ్ సౌతెర్న్ ఇండియా ఈజ్ ఎవాల్వింగ్ డిస్టింక్ట్ ఫీచర్స్’ అనే శీర్షికతో ఈ నెలలో పబ్లిష్ అయింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment