హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్ /నవంబర్ 25: గూగుల్ మ్యాప్స్ ను నమ్మి నదిలో పడి ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మడం ప్రాణాలకు ముప్పు అని మరోసారి నిరూపణ అయ్యింది. యూపీలోని బరేలీ లో ఓ ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కారులో ప్రయాణిస్తున్నారు. తీవ్ర పొగమంచు కారణంగా జీపీఎస్ నే ప్రామాణికంగా ఉపయోగిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు. జీపిఎస్ నిర్మాణంలో ఉన్న వంతెన చూపించడంతో దానినే అనుసరిస్తు వెళుతుండగా కారు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదుకు చేసుకొని విచారించారు. గూగుల్ మ్యాప్ కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపాడు.