మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్..

Get real time updates directly on you device, subscribe now.

సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారం..

మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్

హ్యూమన్ రైట్స్ టుడే/సిద్దిపేట/నవంబర్ 16: సోషల్ మీడియాలో సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. సర్వేలో ఎలాంటి బ్యాంక్ వివరాలు అడగటం లేదని స్పష్టం చేశారు. 87 వేల ఎన్యుమారెట్‌లను పెట్టీ సర్వే జరిపిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 30శాతం సర్వే పూర్తి అయ్యిందని తెలిపారు. సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగదని అన్నారు. కొండపాక మండలం దుద్దేడ గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశానికి దిక్సూచిగా సర్వే నిలబడుతుందన్నారు. సర్వే కావాలని కోరిన వారే నేడు కనబడటం లేదని చెప్పారు. సర్వేను అడ్డుకున్న వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా అందరికీ గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి పాల్గొన్నారు.

నెహ్రూ జీవిత చరిత్రను చదవాలి

‘‘గ్రంథాలయాలు నిరుద్యోగ యువతకు చదువుకోవడానికి ఉపయోగపడేలా చేయాలి. ఈరోజు ఎంప్లాయ్‌మెంట్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల్లో 45 వేల ఉద్యోగాలు ఇచ్చింది. చదివిన జ్ఞానం జీవితంలో ఏదో చోట ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే వేదిక గ్రంథాలయం. సిద్దిపేట గ్రంథాలయం రాష్ట్ర గ్రంథాలయాలకు దీటుగా అభివృద్ధి చేస్తాం. నెహ్రూ ఐఐటీ, ఎయిమ్స్, విద్యాలయాలు, సాంకేతికత రంగంలో అభివృద్ధి చేయడం వల్లనే నేడు దేశం ముందుకు వెళ్తుంది. నెహ్రూ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలి. బ్రాంచ్ లైబ్రరీల సంఖ్య తక్కువగా ఉంది కావాల్సిన మెటీరియల్ అందించాలి’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..

రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్న రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు రాద్ధాతం చేయకుండా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాకో సీనియర్ అధికారిని నియమించి ధాన్యం కొనుగోలును పర్య వేక్షిస్తున్నామన్నారు. కాళేశ్వరం లేకున్నా కాళేశ్వరం ద్వారా పంటలు బాగా పండాయని బీఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైస్ మిల్లర్ల విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పారు. 20 మంది డిఫల్టర్‌లు ఉన్నారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించి మీరు కొనుగోలులో పాల్గొనాలని కోరారు. 101 మంది రైస్ మిల్లర్లు ఉన్నారు. వారు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment