మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు

Get real time updates directly on you device, subscribe now.

లగచర్ల ఘటన ఆ పార్టీ కుట్రే..

 మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 16: లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీ కుట్రేనని, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రైతులను రెచ్చ గొడుతున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులూ ఉన్నా రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని అన్నారు.ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి తమకు అప్పగించారని విమర్శించారు. అయినా తాము నిధులు సమకూర్చుకుంటున్నామని చెప్పారు. హరీష్ రావు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘సన్నాలు పండించిన ప్రతీ రైతుకు బోనస్ ఇస్తాం. రైతులు ఎవరు చింతించవద్దు అందరికీ బోనస్ ఇస్తాం. ధాన్యం సేకరించిన వారం రోజుల్లోపే రూ.500 బోనస్ ఇస్తాం. సూచనలు చేయండి కానీ దుష్ప్రచారం చేయకండి. ప్రభుత్వ అధికారులను తరిమి కొడతామని అగ్ర నేతలు చెప్పారు. అధికారులపై దాడి చేస్తే ఖండిచకుండా ఆహ్వానిస్తారా. కలెక్టర్ గ్రూప్ వన్ అధికారిని చంపే ప్రయత్నం జరిగిందా లేదా. ప్రజా స్వామికంగా మేము ముందుకు వెళ్తున్నాం. భయ బ్రాంతులకు గురి చేస్తాం, యంత్రాంగాన్ని భయపెడతాం అంటే కరెక్టేనా. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి’’ అని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు విమర్శించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment