మీకు రైతుల మీద ప్రేమ ఉంటే గైడ్ లైన్స్ మార్చండి..

Get real time updates directly on you device, subscribe now.

ఆ గైడ్ లైన్స్ మార్చండి.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 16: వరి సాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సన్న రకాలు 25 నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడమే అందుకు కారణమని అన్నారు. సంక్రాంతి నుంచి రేషన్‌తో సహా అన్ని హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.

దొడ్డు రకం వరి సాగు 41 లక్షల నుంచి 21 లక్షల ఎకరాలకు పడిపోయిందని చెప్పారు. రాష్ట్ర అవసరాలే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందన్నారు. 7411ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారం కోల్పోయిన పార్టీ అధికారం కోసం రైతుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
‘‘అన్ని గ్రామ పంచాయితీల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టం. వడ్లు ఆరపోసిన దగ్గర రైతులు ఆందోళన చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు ఉండొచ్చు. రాష్ట్రంలో రెండో స్థానం కోసం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఉండొచ్చు. మీ ఆధిపత్య పోరు కోసం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేయొద్దు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే మేము ధాన్యం కొనాలి. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే గైడ్ లైన్స్ మార్చండి. కృత్రిమ ఆందోళనతో శునకానందం పొందడం సరికాదు. సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతు భరోసా ఇస్తాం. రైతులను ఇబ్బంది పెట్టే రాజకీయ క్రీడను పార్టీలు మానుకోవాలి’’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment