గాడిద పాలు పేరుతో రూ. 100 కోట్ల మోసం..

Get real time updates directly on you device, subscribe now.

లీటర్ గాడిద పాలు రూ. 1600 లకు కొనుగోలు చేస్తామంటూ..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 15: హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గాడిద పాల ఉత్పత్తి పేరిట తమిళనాడుకు చెందిన డ్యాంకీ ప్యాలెస్ సంస్థ రూ. 100 కోట్ల మోసానికి పాల్పడింది. లీటర్ గాడిద పాలు రూ. 1600 లకు కొనుగోలు చేస్తామంటూ దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రైతులను నమ్మించింది.

అందుకు వారితో ఒప్పందం సైతం కుదుర్చుకుంది. ఆ క్రమంలో ఒక్కొ గాడిదను వారికి రూ. లక్షన్నరకు విక్రయించింది. ఒప్పందం ప్రకారం తొలి మూడు నెలలు రైతులకు సక్రమంగా సంస్థ నగదు చెల్లించింది. ఆ తర్వాత వారికి నగదు చెల్లింపులు నిలిపివేసింది. దీంతో సంస్థ యాజమాన్యాన్ని రైతులు నిలదీశారు.

దాంతో వారికి చెక్కులను అందజేసింది. అవి సైతం బౌన్స్ అయ్యాయి. తాము మోసపోయామని రైతులు భావించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన బాధితులు శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్‌ క్లబ్‌లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమను న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. గత 18 నెలలుగా తమకు నగదు చెల్లించడం లేదని వారు తెలిపారు.

ఇటీవల కాలంలో గాడిద పాలు విక్రయం బాగా పెరిగింది. వీటికి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆవు పాలు, గేదె పాలు కంటే గాడిద పాలు శ్రేష్టమైనవని ఓ ప్రచారం అయితే జరుగుతుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు సైతం ఈ గాడిద పాలు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే ఈ గాడిద పాల ధర అధికంగా ఉంటుందని సమాచారం.
అయితే ఆరోగ్య దృష్ట్యా ఈ పాల వినియోగం అధికంగా ఉంది. దీంతో భారీగా లాభాలు ఆర్జించ వచ్చంటూ..రైతులను డాంకీ ప్యాలెస్ సంస్థ ఆశ చూపింది. ఆ క్రమంలో భారీగా నగదు వెచ్చించి.. గాడిదలను కొనుగోలు చేసేలా వ్యూహా రచన చేశారు. తొలి నాళ్లలో సజావుగా నగదు చెల్లించిన సదరు సంస్థ.. ఆ తర్వాత రైతులను నట్టేట ముంచేసింది. ఈ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాలను వారు అభ్యర్థిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment