ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల తొంబై మూడు వేల రూపాయలు (1,28,93000/-) విలువైన గంజాయి దగ్ధం..
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్/నవంబర్ 14: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సీజ్ చేయబడిన ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల తొంబై మూడు వేల రూపాయలు (1,28,93000/-) విలువైన గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు.
కాకతీయ మెడిక్లీన్ ఏజెన్సీ, ఊర్సుగుట్ట, హన్మకొండలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS డ్రగ్ డిస్పోసల్ కమిటీ అధికారి ఆదేశాల మేరకు డ్రగ్ డిస్పోసల్ కమిటీ సభ్యలు అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నైయ్య, డిఎస్పీ తిరుపతి రావు సమక్షంలో 515 కేజీ 720 గ్రాముల గంజాయి దహనం చేశారు.
మహబూబాబాద్ జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా గత కొంతకాలంగా నిర్వహించిన వివిధ దాడుల్లో పట్టుబడిన భారీ మొత్తంలో ఈరోజు ధ్వంసం చేశారు.
కాలిపోయిన గంజాయి విలువ 1,28,93000/- ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో నమోదు అయినా 24 కేసులలొ మొత్తం 515kgs 730 గ్రామ్స్ గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్‌ను రవాణా చేసిన వారిపై కఠిన చర్యల తీసుకుంటామని తెలిపారు.
గంజాయి దగ్ధం చేయు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, డిఎస్పీ తిరుపతి రావు, సీఐ DCRB సత్యనారాయణ, సీఐ టౌన్ దేవేందర్, సీఐ డోర్నకల్ రాజేష్, సీఐ గూడూరు బాబు రావు, సీఐ బయ్యారం రవి పాల్గొన్నారు.
PRO to SP మహబూబాబాద్