మహిళ అఘోరి సంచలన వ్యాఖ్యలు..

Get real time updates directly on you device, subscribe now.

తెలంగాణలో నన్ను ఆపే మగాడు ఇంకా పుట్టలేదు: మహిళ అఘోరి సంచలన వ్యాఖ్యలు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 13: తెలంగాణకు అఘోరీ తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీకి ఆమె చేరుకుంది. ఇటీవల ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను సందర్శించింది. అఘోరీని చూడడానికి జనాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జనాలను కంట్రోల్ చేసేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. హిందూ ధర్మం రక్షణ కోసం పోరాడుతుంటే తనను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని అఘోరీ మండిపడ్డారు.

హిందూ దేవాలయాలు ఆడపిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మాహుతి చేసుకుంటా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ శివ తాండవం చేస్తానంటూ ఇటీవల ఆర్టీవీతో అఘోరీ మాట్లాడింది.

సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అని తెలిపింది. ఎక్కడ ఆడపిల్ల కి అన్యాయం జరిగితే అక్కడ తానుంటా అని పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణలో తనను అపే మగాడు ఇంకా పుట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది,

తెలంగాణలో శివ తాండవం జరగబోతుందని ఆడపిల్ల మీద చేయి వేసినవాడి మర్మాంగాలు కోసేస్తా అని అఘోరీ చెప్పుకొచ్చింది.

తెలంగాణలో ఆలయాలను ధ్వంసం అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని మండిపడింది. మరోవైపు  పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని అయితే ఆయన నుంచి తనకు ఎటువంటి సందేశం ఇంకా అందలేదని అఘోరీ చెప్పుకొచ్చింది.

దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతు న్నాయి. ఇదిలా మరోవైపు ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. బెల్లంపల్లిలో నిర్వహించే లక్ష దీపాల మహోత్సవానికి తరలి రండి అని ఆ వీడియోలో పేర్కొంది.

సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని తెలిపింది. స్త్రీలపై దాడులను ఆపే శక్తి మన దగ్గర ఉందని చెప్పుకొచ్చింది. గోహత్యలను నివారించేందుకు పోరాడుదాం అని చెప్పుకొచ్చింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment