కేటీఆర్ ఆదేశాలతోనే కలెక్టర్‌పై దాడి !
రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు!
హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్ నవంబర్ 14: కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగినట్లు పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర పన్నారని సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు ఒప్పుకున్నట్లు రిపోర్టులో నమోదు చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇందులో భాగంగానే నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ లోని కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగినట్లు పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర పన్నారని, సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయింది.